Wednesday, March 11, 2009

బేబీ హాల్ దార్ - చీకటి వెలుగులు

ఇది బేబీ అనే అమ్మాయి కథ.
చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయిన తల్లి, పిల్లల పట్ల శ్రద్ధ లేని తండ్రీ, పన్నెండేళ్ళకి పెళ్ళవడం, పద్నాలుగేళ్ళపుడు తల్లవడం, బాధ్యతలేని భర్త, భర్తని వదిలి ముగ్గురు పిల్లలతో తానే స్వతంత్రంగా బ్రతకాలని నిర్ణయించుకోవడం, ఎవరి తోడ్పాటూ లేకున్నా, తనకున్నది ఆరోక్లాసు చదువే అయినా ధైర్యంగా నిలబడడం.. ఇలా తన కథంతా తానే బేబీ బెంగాలీలో రాస్తే, దాన్ని ప్రబోధ్ కుమార్ గారు హిందీ లోకీ, శాంతసుందరి గారు తెలుగులోకీ అనువదించారు.
ఈ పుస్తకంగురించి ముందే వినివుండడంతో కొంత ఎక్కువ ఎక్స్ పెక్టేషన్ తో చదవడం మొదలుపెట్టినందుకేమో నాకంత గొప్పగా ఏమీ అనిపించలేదు.
కానీ అటువంటి పరిస్థితులలో వున్న ఒక అమ్మాయి తన కథ తానే చెప్తూండగా తెలుసుకోవడం ఒక వదులుకోలేని అనుభవమే.
అందుకోసం ఈ పుస్తకం చదవచ్చు. శాంతసుందరి గారి అనువాదం బాగుంది.
సామాజిక సంబంధాల గురించీ, నియమాల గురించీ, మనిషి వ్యక్తిత్వం గురించీ చాలా పుస్తకాలు చదివినపుడు వచ్చినట్లే ఈ పుస్తకం చదివినపుడూ నాకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి. పుస్తకం చదివాక వాటి గురించి ఓ రెందురోజులపాటు ఆలోచన జరిగింది.

1 comment:

  1. సౌమ్య గారు,నేను నెటిజన్ స్పీక్స్ బ్లాగులో ఖదీర్ బాబు కథకు ప్రేరణ తెలిపుంటే బాగుండేది అన్న వ్యాఖ్యకు,"మీరెందుకు ఇలాంటి రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తారు? రచయిత ప్రతికథకీ ప్రేరణ ఏదో చెప్పనవసరంలేదే!" అని చెప్పారు.

    నా ఉద్దేశం రెచ్చగొట్టడం అస్సలు కాదు. ఈ ప్రపంచంలో "ఒరిజినాలిటీ" ఎక్కడా లేదని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి ప్రేరణలు అవి జీవితంలో నుంచైనా లేక ఇతరసాహిత్యం నుంచైనా పొందితే తప్పని నేనస్సలు అనుకోను. ఖదీర్ బాబు రాసిన కథకు ఒక ఆంగ్ల కథ ప్రేరణ అని నాకు బలంగా అనిపించింది. అందుకే ఆ మాట అన్నాను.

    కావల్సిస్తే ఈ క్రింది లంకెలోని కథ చదివి మీరు నిర్ణయించుకోండి. If you still feel my intention was to instigate, then I have no explanation to offer.

    http://www.scribd.com/share/upload/11071925/2g2mdz7gbfem3gzlrl7u

    ReplyDelete