Wednesday, June 3, 2009

The Art of Happiness – HH DALAI LAMA & HOWARD C CUTLER

The Art of Happiness అనే పుస్తకం చాలా ఉత్కంఠతో తెరిచాను.
మొదటి పేజీలో Dedicated to the Reader. May you find happiness అన్న వాక్యాలు నా ఆసక్తిని మరింత పెంచాయి.
అయితే చదవడం మొదలు పెట్టాక కొత్తగా తెలుసుకున్నదేమీ లేదనిపించింది.
ఈ పుస్తకాన్ని దలైలామా తో తన చర్చల రూపంలో రాశాడు రచయిత. మధ్య మధ్య తన వివరణలు, అభిప్రాయాలు కూడా యిస్తూ.

అయితే యిది చదువుతున్నపుడు ఒకటి మాత్రం అనిపించింది. "వెస్టర్న్ పాఠకులకి ఇంత చిన్న విషయాలు కూడా ఇంత వివరంగా చెప్పాలా" అని.

ఊదాహరణకి మొదటి చాప్టర్ లో హాపీ గా వున్న వాళ్ళు (వుండాలనుకునేవాళ్ళు) ఎక్కువ స్వార్ధంతో వుంటారని అనుకోనక్కరలేదని, అసంతృప్తితో వుండేవాళ్ళలోనే స్వార్ధం ఎక్కువగా వుంటుందనీ వివరించడానికి దాదాపుగా రెండు పేజీల వివరణ యిచ్చాడు రచయిత.
ఇంత చిన్న విషయానికి యింత వివరణా! అనిపించింది.
రెండో చాప్టర్ లో ఆనందంగా వుండడానికి మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళతో పోల్చుకోవడం మంచిదనే సిద్ధాంతం చెప్పబడింది.
ఈ సిద్ధాంతం తెలిసిందే. అయితే ఎంత చిన్న సిద్ధాంతమయినా ఆచరణలో అనేక సందేహాలు, సమస్యలూ వస్తాయి. (మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళతో పోల్చుకుంటే ఎదుగుదల వుండదు కదా! లాంటివి).
ఇలాంటి పుస్తకం చదువుతున్నపుడు … కేవలం సిద్ధాంతాన్ని కాక, ఆ సిద్ధాంతాన్ని ఆచరించడంలో మనుషులు ఎదుర్కునే కంఫ్యూజన్స్ నీ, సమస్యలనీ చర్చించి వాటికి సమాధానాలు చెప్తే బాగుంటుందని ఆశించాను నేను. కానీ ఈ పుస్తకంలో సిద్ధాంతాన్ని ప్రతిపాదించడమే చాలా పేజీలు తీసుకుంది. ఇక అన్నికోణాలనుంచీ దానిని విశ్లేషించడం లేదు.

అలాగే సంతోషంగా వుండడానికి అవతలివారిపట్ల గౌరవం చూపాలనీ, కరుణ పెంపొదించుకోవాలనీ చెప్పబడింది.
కానీ చాలా సందర్భాలలో మనుషులు ఆనందానికి దూరమవడానికి కారణం అవతలివారినుండి గౌరవాన్నీ, కరుణనీ పొందకపోవడం. గౌరవమూ, ప్రేమా, కరుణా లభించనపుడు కూడా ఆనందంగా ఎలా వుండాలి, ఆ బాధని ఎలా ఎదుర్కోవాలి అనేవి పెద్ద సమస్యలు. అవి ఈ పుస్తకంలో చర్చించబడలేదు.
అలాగే చాలా విషయాలు రెండు ఎక్స్ట్రీంస్ మాత్రం వివరించి వూరుకున్నారు.
ఉదాహరణకి ప్రేమ. ఆకర్షణ. పైపై విషయాలు చూసి కలిగేది ఆకర్షణ. దానికి దూరంగా వుండాలి. గుణగణాలు చూసి కలిగేది ప్రేమ. అది పెంపొందించుకోవాలి. అని చెప్పారు. బాగుంది. కానీ జీవితం అంత సింపుల్ కాదే. నిజమైన ప్రేమ, ఒట్టి ఆకర్షణ మాత్రమే వుంటే అసలు సమస్యే లేదు.
ప్రేమలోని రకరకాల కోణాలు, స్థాయిలు వీటీల్తో సమస్యలు వస్తాయి. వాటి గురించి అసలు వివరణే లేదు.
మొత్తానికి అవసరమయిన చాలా ప్రశ్నలు ఈ పుస్తకంలో రాలేదు. వచ్చిన వాటికి కూడా సూటిగా, స్పష్టంగా సమాధానాలు రాలేదు.
అందుకే చాలా సాధారణంగా అనిపించిందీ పుస్తకం నాకు.

3 comments:

  1. "ఇంత చిన్న విషయానికి యింత వివరణా! అనిపించింది."
    You will be amazed at the crazy notions people carry in their minds - even perfectly intelligent and rational people - about such esoteric things like happiness, purpose of life, etc.
    ఇటువంటి పుస్తకాల్లో ఎవరైనా కొత్తగా చెప్పేదేమీ ఉండదని నా అనుభవం. అద్సరే, కొన్నేళ్ళుగా తెలుగులో తెలుగు రచయితలు రాసిన వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు తామర తంపరగా వస్తున్నాయి - ఏవైనా చదివారా మీరు?

    ReplyDelete
  2. లేదండీ. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు తెలుగులో పెద్దగా చదవలేదు. ఇంగ్లీషులో చదివినపుడు నా అనుభవమూ అదే. (కొత్తగా చెప్పేదేమీ వుండదని). అయితే ఈ పుస్తకాన్ని ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకంగా భావించి చదవలేదు నేను. ఒక స్పిరిట్యువల్ లీడర్ పుస్తకం కాబట్టి డిఫరెంట్ గా వుంటుందనుకున్నాను.

    ReplyDelete
  3. తెలుగులో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు పుంఖాలు పుంఖాలుగా వస్తున్నా, నాకు నచ్చేవి మాత్రం యండమూరి రాసిన విజయానికి ఐదుమెట్లు, విజయానికి ఆరోమెట్టు,తప్పుచేద్ధాం రండి వంటి పుస్తకాలు. కొంత స్వోత్కర్ష అనిపించినా తన సొంత అనుభవాలకి ధియరీని అన్వయించుకొంటూ, మన సామాజిక పరిస్థితుల్లోని ఉదాహరణలు వివరిస్తూ తను రాసేవిధానం మన "కథాసంస్కృతిని" తలపిస్తుంది.

    ReplyDelete